Telangana Search

Search results

Monday 28 December 2015

కుక్క కోసం కోటి!



కుక్కలంటే.. చాలామందికి ఇష్టం. వేలకు వేలు పెట్టి మంచి జాతి కుక్కలను ఎంచుకొని.. పెంచుకుంటారు. కానీ ఓ బ్రిటీష్ జంట... అక్షరాలా కోటీ 31 లక్షల డాలర్లు ఖర్చు పెట్టి కుక్క పిల్లను క్లోనింగ్ చేయించుకుంది. ఇలా చేయించుకున్న తొలి జంటగా రికార్డులకెక్కింది. లండన్‌లో నివసించే లారా జాక్వెస్, రిచర్డ్ రెమిడే అనే దంపతులకు కుక్కలంటే ప్రాణం. ఇంట్లో ఎన్నో కుక్కలు ఉన్నాయి. అయితే ఎంతో ప్రేమతో పెంచుకుంటున్న 8 ఏళ్ల బాక్సర్ కుక్క డైలన్ కొన్ని నెలల క్రితం గుండెపోటుతో మరణించిందట. ఆ చనిపోయిన కుక్కను క్లోనింగ్ 

చేయాలనుకున్నారు. దక్షిణ కొరియాలోని సోవమ్ అనే బయోటెక్ కంపెనీని ఆశ్రయించారు. డైలన్ డీఎన్‌ఎను సేకరించి.. .. దాన్ని ఓ ఆడకుక్క అండంలో ప్రవేశపెట్టారు. అనంతరం ఆ కుక్క జన్మనిచ్చిన పిల్లలనే ఈ జంట పెంచుకుంటోందట. వాటికోసం వాళ్లు అక్షరాల కోటీ 31 లక్షలు ఖర్చు చేయడంతో హాట్ టాపిక్ అయ్యారు. తమ చర్యను జనం ఆమోదించకపోవచ్చు, కానీ తమకు మాత్రం డైలన్ అంటే ప్రాణంతో సమానమని చెప్పుకొచ్చారు. ఎంత తల్లడిల్లినా.. కుక్క కోసం అంత ఖర్చు పెట్టడం అవసరమా? అని బుగ్గలు నొక్కుకునే వాళ్లూ లేకపోలేదు. 

1 comment: